
సాధరణంగా కరివేపాకును తినడానికి ఎవరు ఇష్టపడరు. దానిని కేవలం కూరల్లో రుచికి మాత్రమే వాడుతుంటారు. ఇక కూరలో కరివేపాకు.. కరివేపాకును తీసి పాడేసినట్టు అంటూ చాలా సామెతలను రెగ్యులర్‌గా వాడుతుంటాం. కానీ కరివేపాకు మనకు ఎన్ని ప్రయోజనాలను చేకురుస్తుందో తెలుసా…
సామాన్యంగా సౌత్ ఇండియాలో ఏ కూరలో అయిన కరివేపాకు వాడడం అనేది తప్పనిసరి. ఎందుకంటే కరివేపాకు వేస్తే ఆ కూరకు తగిన రుచి వస్తుందని నమ్ముతుంటాం. కానీ తినేప్పుడు మాత్రం దానిని తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే దాని వలన కలిగే ప్రయోజనాలు మనకు తెలియకపోవడమే. మెడికల్ భాషలో కరివేపాకును ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని అంటుంటారు. కరివేపాకును ఎక్కువగా తినడం వలన చర్మం, జుట్టు, ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అలాగే ఉదయం లేవగానే కరివేపాకును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచింది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఉన్న వారు రోజూ కరివేపాకును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. ఉదయం లేవగానే ఓక గ్లాసు మంచి నీళ్లు తాగి.. ఆ తర్వాత నాలుగైదు కరివేపాకుల్ని తినాలి. ఆ తర్వాత ఓ అరగంట వరకు ఏమి తినకుండా ఉండాలి. ఇలా చేయడం వలన కరివేపాకులో ఉండే విటమిన్ సి, పాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మనం వాడే కొబ్బరి నూనేలో నాలుగైదు కరివేపాకులను వేసి గోరువెచ్చగా వేడి చేసి ఆ తర్వాత తలకు మర్ధన చేయడం వలన జుట్టు నలుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి కరివేపాకు ఔషదంగా పనిచేస్తుంది. ఖాళీకడుపుతో ప్రతీరోజూ కరివేపాకు తినడం వలన జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ను క్రమబద్దీకరిస్తాయి. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
రోజూ తినే కూరలోని కరివేపాకులను పక్కన పడేయకుండా తినడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లలకు కరివేపాకును తినడం అలవాటు చేస్తే వారికి వారికి కంటి చూపు సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజూ ఉదయం నాలుగైదు కరివేపాకు ఆకులను తినడం వలన బద్దకం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి.
Also Read:
Health benefits of spinach: బ్రెస్ట్ క్యాన్సర్‌ను పాలకూర అదుపు చేస్తుందా ? పోషకాహార నిధిగా ..