Breaking: హర్యానా సీఎంకు కరోనా పాజిటివ్…

| Edited By: Pardhasaradhi Peri

Aug 24, 2020 | 8:06 PM

ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా నిర్ధారణ కాగా.. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Breaking: హర్యానా సీఎంకు కరోనా పాజిటివ్...
Follow us on

Haryana CM Corona Positive: ప్రముఖులనూ వదలని వైరస్‌.… కరోనా పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. సామాన్యుడి నుంచి సెలబ్రేటీల దాకా మహమ్మారి ధాటికి విలవిలలాడుతున్నారు. కరోనా బారిన పడుతున్న నేతల సంఖ్య అధికమవుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా నిర్ధారణ కాగా.. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

ఈ మేరకు తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా ఆయనే స్వయంగా తెలిపారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా ఎవరికి వారు స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేసారు.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..