వ్య‌వ‌సాయ మంత్రి జేపీ ద‌లాల్‌కు క‌రోనా పాజిటివ్

|

Aug 26, 2020 | 1:33 PM

సామాన్యులతోపాటు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఎక్కువ సంఖ్య‌లోనే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి జేపీ ద‌లాల్‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.

వ్య‌వ‌సాయ మంత్రి జేపీ ద‌లాల్‌కు క‌రోనా పాజిటివ్
Follow us on

దేశంలో కరోనా కల్లోలం కంటీన్యూ అవుతోంది. కొవిడ్ రాకాసికి గురవుతున్న ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతూనే ఉంది. అటు హ‌ర్యానాలో క‌రోనా విస్త‌ర‌ణ కొన‌సాగుతున్న‌ది. సామాన్యులతోపాటు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ఎక్కువ సంఖ్య‌లోనే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి జేపీ ద‌లాల్‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. ఈ విష‌యాన్ని బుధ‌వారం ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. మూడు రోజుల క్రితం ఒక‌సారి ప‌రీక్ష‌లు చేయిస్తే నెగెటివ్ వ‌చ్చింద‌ని, ఎందుకైనా మంచిద‌ని మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించ‌గా పాజిటివ్‌గా తేలింద‌ని ద‌లాల్ తెలిపారు.

క‌రోనా సోకినందున తాను ఇంట్లోనే రెండు వారాల‌పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంటాన‌ని జేపీ ద‌లాల్ చెప్పారు. ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా తిరిగిన వాళ్లంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. కాగా, ద‌లాల్‌తో క‌లిపి హ‌ర్యానాలో క‌రోనా బారిన‌ప‌డ్డ అధికార బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్‌ క‌ట్ట‌ర్, స్పీక‌ర్ జ్ఞాన్‌చంద్ గుప్తా, ర‌వాణామంత్రి మూల్‌చంద్ శ‌ర్మ ఉన్నారు. వీరితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సైతం కొవిడ్ బారినపడుతుండడం పట్ల హర్యానావాసులు ఆందోళన వ్యక్తమవుతోంది.