ఐపీఎల్‌కు భజ్జీభాయ్ దూరం కానున్నాడా?

|

Sep 01, 2020 | 11:49 AM

కరోనా ప్రభావంతో ఐపీఎల్ 2020 దుబాయ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైరస్ విస్తరిస్తుండడంతో ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఐపీఎల్ కు వెళ్లాలా? వద్దా? తర్జనభర్జన పడుతున్నట్లు కనిపిస్తుంది.

ఐపీఎల్‌కు భజ్జీభాయ్ దూరం కానున్నాడా?
Follow us on

కరోనా ప్రభావంతో ఐపీఎల్ 2020 దుబాయ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం వైరస్ విస్తరిస్తుండడంతో ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ ఐపీఎల్ కు వెళ్లాలా? వద్దా? తర్జనభర్జన పడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సారి ఐపీఎల్‌కు భజ్జీభాయ్ దూరం కానున్నాడా? పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. వాస్తవంగా అతడు మంగళవారం దుబాయ్‌ వెళ్లి చెన్నై జట్టుతో కలవాల్సి ఉంది. కానీ జట్టులో ఇద్దరు క్రికెటర్లు సహా సహాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడడం, సురేశ్‌ రైనా హఠాత్తుగా స్వదేశం తిరిగి రావడంతో హర్భజన్‌ సింగ్‌ ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. దీంతో ఐపీఎల్ లో పాల్గోనేందుకు దుబాయ్‌ వెళ్లడం కొద్దిరోజులు వాయిదా వేసుకోవడమా లేదంటే అసలు ఐపీఎల్‌కే దూరం కావడమా.. అనే ఆలోచనలో భజ్జీ ఉన్నట్టు అతడి సన్నిహితులు వెల్లడించారు. కాగా, భజ్జీభాయ్ తుదినిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.