Pawan Kalyan’s Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం తాజాగా ఈ సినిమాలోని ఓ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. చిత్ర యూనిట్. నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘పంచమి’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ట్రెడిషనల్ వేర్‌లో నాట్యం చేస్తున్న నిధి లుక్ ఆకట్టుకుంటోంది.
పంచమిగా నటిస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేస్తూ, దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు. “బ్యూటీ బ్యూటీ ఎలిగెంట్ అండ్ రేడియంట్ ఆఫ్ ది మూన్ … మా బ్రహ్మాండమైన పంచమి నిధి అగర్వాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పారు. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా కుతుబ్ షాహీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్రతీ విషయం స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.
హరి హర వీర మల్లు పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది. ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు. పవన్ సరసన.. నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. చారిత్రక పరిస్థితులను కళ్లకు కట్టేందుకు చార్మినార్ తోపాటు గండికోట సంస్థానం సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్ ఫ్యాన్స్ ఊహలకు అందని స్థాయిలో ఉంటాయని ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నందాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ ఈ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: Inspiring Story: పట్టుదల ముందు ఓడిన అంగవైకల్యం.. బాంబ్ బ్లాస్ట్‌లో చేతులు కోల్పోయినా చదువులో ఈమె సరస్వతినే