గంటాకు షాక్: భవనం కూల్చివేతకు రంగం సిద్ధం

| Edited By:

Aug 23, 2019 | 8:52 AM

అధికారంలోకి రాగానే.. ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్ మొదటిగా.. అక్రమ కట్టడాలపై ఫోకస్ చేశారు. ఎవరిదైనా.. ఎవరైనా.. అనవసరం.. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ కట్టడాలు ఉండొద్దని హుకుం జారీ చేశారు. దీంతో.. రెవెన్యూ ఆఫీసర్స్.. అక్రమ కట్టడాలపై పడ్డారు. కొద్ది రోజుల క్రితం.. ప్రజావేదిక కూల్చివేతపై పెద్ద హైడ్రామేనే చోటుచేసుకుంది. అనంతరం చంద్రాబాబు ఇంటి నిర్మాణం కూడా అక్రమమేనని.. నోటీసులు కూడా పంపించారు. ఆ తర్వాత.. ఒక్కొక్కటిగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడింది వైసీపీ ప్రభుత్వం. ఈ […]

గంటాకు షాక్: భవనం కూల్చివేతకు రంగం సిద్ధం
Follow us on

అధికారంలోకి రాగానే.. ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్ మొదటిగా.. అక్రమ కట్టడాలపై ఫోకస్ చేశారు. ఎవరిదైనా.. ఎవరైనా.. అనవసరం.. ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ కట్టడాలు ఉండొద్దని హుకుం జారీ చేశారు. దీంతో.. రెవెన్యూ ఆఫీసర్స్.. అక్రమ కట్టడాలపై పడ్డారు. కొద్ది రోజుల క్రితం.. ప్రజావేదిక కూల్చివేతపై పెద్ద హైడ్రామేనే చోటుచేసుకుంది. అనంతరం చంద్రాబాబు ఇంటి నిర్మాణం కూడా అక్రమమేనని.. నోటీసులు కూడా పంపించారు. ఆ తర్వాత.. ఒక్కొక్కటిగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో పడింది వైసీపీ ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో.. భీమిలిలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు పార్టీ క్యాంపు ఆఫీస్ వద్ద ప్రస్తుతం హైడ్రామా నడుస్తోంది. 24 గంటల్లోగా పార్టీ ఆఫీస్ కూల్చివేయాలంటూ.. గురువారం ఆదేశాలు జారీ చేసింది జీవీఎంసీ. ఎటువంటి అనుమతులు లేకుండా సీఆర్జెడ్ పరిధిలోని భవనాలు నిర్మించారంటూ.. జీవీఎంసీ పేర్కొంది. గతంలోనే అక్రమ నిర్మాణం అంటూ.. అధికారులు నోటీసులు జారీ చేశారు. బీపీఎస్‌కి దరఖాస్తు చేస్తున్నప్పటికీ.. దరఖాస్తు రిజెక్ట్ అయ్యింది. భవనం కూల్చివేతపై తగిన గడువు ఇవ్వాలంటూ.. గంటా హైకోర్టుకు అడగగా.. స్టే విధించింది. అలాగే.. ప్రస్తుతం భీమిలి ప్రాంతంలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కాగా.. దీనిపై గంటా మంత్రి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.