రూ.54 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది

|

Aug 14, 2020 | 8:14 PM

ప్రకాశం జిల్లాలో భారీగా గుట్నా ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను భారీ స్థాయిలో ...

రూ.54 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది
Follow us on

Gutka Heavily Seized in Prakasam District : ప్రకాశం జిల్లాలో భారీగా గుట్నా ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో గుట్కా పట్టుబడటం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు.

చినగంజాం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇవి పట్టుపడినట్లుగా తెలిపారు. అదే దారిలో వెళ్తున్న ఓ లారీని చెక్ చేయగా గుట్కా బస్తాలు బయటపడ్డాయన్నారు. దీంతో లారీలో తరలిస్తున్న 153 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ సుమారు రూ.54 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, గుట్కాను తరలిస్తున్న లారీ డ్రైవర్ మధుబాబు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గుట్కా బస్తాలను ఎక్కడికి తరలిస్తున్నారో విచారణలో తేలుతుందని అన్నారు. అయితే తయారీదారుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.