తరుముకొస్తున్న నిసర్గ అలలు

|

Jun 03, 2020 | 3:57 PM

నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి.

తరుముకొస్తున్న నిసర్గ అలలు
Follow us on

రాకాసి అలలతో నిసర్గ భారత్ వైపు దూసుకొస్తోంది. నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. తుఫాను నేప‌థ్యంలో అధికారులు ఇప్ప‌టికే అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. 16 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో మోహ‌రించారు. తీర ప్రాంత గ్రామాల‌కు చెందిన సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. కాకా, గుజ‌రాత్‌లోని ద్వార‌క పుణ్య‌క్షేత్రం వ‌ద్ద అల‌ల ఉధృతి మరింత ఎక్కువ‌గా ఉన్న‌ది. దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో రాకాసి అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి.