కేంద్రం గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు..

కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జీఎస్టీ రేట్లలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. 28 శాతం శ్లాబులో ఉన్న సుమారు 230 వస్తువులు..

కేంద్రం గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లలో కీలక మార్పులు..

Updated on: Aug 24, 2020 | 5:58 PM

GST Rates Reduced: కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జీఎస్టీ రేట్లలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. 28 శాతం శ్లాబులో ఉన్న సుమారు 230 వస్తువులు, సేవలలో 200 వస్తువులను తక్కువ శ్లాబ్‌కు మార్చింది. అటు హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్‌లో ఉంచగా.. తక్కువ గృహాలపై జీఎస్టీని 1 శాతానికి తగ్గించింది.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..

అటు ఏడాది రూ. 40 లక్షలు టర్న్ ఓవర్ చేసే బిజినెస్‌లను జీఎస్టీ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. గతంలో ఈ లిమిట్ రూ. 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇక రూ. 1.5 కోట్లు వార్షిక ఆదాయం వచ్చే కంపెనీలు కంపోజిషన్ స్కీంను ఎంచుకుని 1శాతం ట్యాక్స్ కట్టే అవకాశం కల్పించింది. ఇక గృహ అవసరాలకు ఉపయోగించుకునే హెయిర్ ఆయిల్, టూట్ పేస్ట్, సబ్బులపై పన్ను రేటును 29.3% నుంచి 18%కి తగ్గించింది. అలాగే సినిమా టికెట్లపై పన్ను రేటు 35% నుంచి 110% వరకు ఉండగా దాన్ని 12%, 18% పన్ను పరిధిలోకి తెచ్చింది. ఇదిలా ఉంటే చాలావరకు నిత్యావసరాల పన్ను రేటు 0-5% మధ్యలోకి తీసుకొచ్చింది. కాగా, కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో చాలావరకు వస్తువులు ధరలు తగ్గనున్నాయి.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..