GST Collections: దుమ్మరేపిన జీఎస్‌టీ వసూళ్లు.. ఈ స్థాయిలో వ‌సూళ్లు సాధించడం ఇదే తొలిసారి..

High GST Collections: కరోనా కాలంలో లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిపోయిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి....

GST Collections: దుమ్మరేపిన జీఎస్‌టీ వసూళ్లు.. ఈ స్థాయిలో వ‌సూళ్లు సాధించడం ఇదే తొలిసారి..

Updated on: Jan 01, 2021 | 8:47 PM

High GST Collections: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిపోయిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. గడిచిన డిసెంబర్‌ మాసంలో జీఎస్‌టీ కలెక్షన్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 2020 డిసెంబర్‌ నెలకు గాను రూ. 1.15 లక్షల కోట్ల వసూళ్లతో మునుపెన్నడూ లేని విధంగా గరిష్టానికి చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. ఈ స్థాయిలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారని ఆర్థిక శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో సీజీఎస్‌టి రూ. 21,365 కోట్లు కాగా.. ఎస్‌జీఎస్‌టీ రూ. 27,804 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 57,426 కోట్లు (దిగుమతిపై వసూలు చేసిన, 27,050 కోట్లు) సెస్, 8,579 కోట్లు (వస్తువుల దిగుమతులపై సేకరించిన 1 971 కోట్లతో సహా). ఇదిలా ఉంటే.. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉండడం గమనార్హం. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం, జీఎస్‌టీ ఎగవేతదారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే వసూళ్లు ఈ స్థాయిలో పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

Also Read: Sensex: కరోనా కాలంలోనూ పెరిగిన పెట్టుబడిదారుల సంపదన… ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?