శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. గత ఎనిమి నెలలుగా కరోనా ఆంక్షలతో ఏకాంత సేవలు నిర్వహిస్తున్న దేవాలయ అధికారులు. తాజాగా పరిస్థితులు మరిపోతుండటంతో అర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల తాకిడి పెరుగుతున్న క్రమంలో సేవలను ఒక్కొక్కటిగా ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఆర్జిత సేవలను అందుబాటులోకి తెచ్చారు.
అక్టోబర్ 7 నుంచి కోడెమొక్కును ప్రారంభించారు. వీటితో పాటు స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, ప్రసాద విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటితో స్వామివారికి అక్టోబర్ 7 నుంచి 31నాటికే 24 రోజులకు గాను రూ. కోటీ40 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్టకట్టను కూడా తెరిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా కళ్యాణకట్టను కూడా సిద్ధం చేసి నాయీబ్రాహ్మణులకు సమాచారం అందించగా వారు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.