‘రాయలసీమ ప్రజల పౌరుషం ఎన్టీఆర్ ను రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది’ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు

మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి నివాసంలో గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి మైసూరా రెడ్డి ..

రాయలసీమ ప్రజల పౌరుషం ఎన్టీఆర్ ను రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది రాయలసీమ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు

Updated on: Dec 11, 2020 | 6:34 PM

మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి నివాసంలో గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమనికి మైసూరా రెడ్డి , మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి , మాజీ డీజీపీ దినేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు శివరామ కృష్ణయ్య, వీరశివా రెడ్డి , మాజీ మంత్రులు మదన్ మొహన్ రెడ్డి , రాం భూపాల్ రెడ్డి లు , గ్రేటర్ రాయలసీమ లోని ఆరు జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. రాయలసీమ వెనుకబాటుతనం గురించి ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ ఆవశ్యకత గురించి ఈ పుస్తకంలో రాసినట్టు తెలిపారు పుస్తక రచయిత మాజీ రాజ్యసభ సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి. పుస్తకం ఆవిష్కరించిన అనంతరం మాజీ హోంమంత్రి మైసురా రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సమస్యలపై ఏరాసు ప్రతాప్ రెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖను పుస్తకంగా రాయడం సంతోషం అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిస్థాయి సమ్మతంగా జరగలేదన్న ఆయన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాయలసీమ వాసులు అయినా చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రజల పౌరుషం 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను సచివాలయం బయట ఆందోళన చేస్తూ రోడ్డు మీదకు తీసుకువచ్చినప్పుడు తెలిసింది అన్నారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.