ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

|

Oct 01, 2020 | 7:40 PM

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పచ్చదనం ఆవశ్యకతను చాటిచెబుతూ ఆయన చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతుంది...

ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
Follow us on

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. పచ్చదనం ఆవశ్యకతను చాటిచెబుతూ ఆయన చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకొని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.

ఈనేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. గ్రీన్ ఛాలెంజ్ తో ఆయన చేస్తున్న కృషికిగాను గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం ఆయనను వరించింది. మహాత్మాగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులు ఈ అవార్డును ఎంపీ సంతోష్ కుమార్ కు అందజేశారు.

ఎంపీ సంతోష్ కుమార్‌ను ప్రత్యేకంగా సన్మానించి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ .. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్‌ను చేపట్టానని  ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వచ్చిన సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. భూమిపుత్రుడిగా తాను గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని మరింత బాధ్యతతో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డును.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.