ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!

లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఊరట..!

Updated on: Jul 30, 2020 | 4:31 AM

లాక్ డౌన్ లో హాజరుకాని ఉద్యోగులకు కేంద్రం ఊరట నిచ్చింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సర్వీసుకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన డీవోపీటీ కార్యాలయం తాజాగా మెమో జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక టూర్‌లో ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ విధించింది కేంద్రం. ఈ సమయంలో ఎక్కడి వారక్కడే ఉండిపోయారు. దీంతో సర్వీసు రూల్స్ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్లారిటీనిచ్చింది. రవాణా సౌకర్యాలు లేక తిరిగి హెడ్‌క్వార్టర్స్‌లో విధులకు హాజరు కాలేకపోయినప్పటికీ, ఉన్నతాధికారులకు ఏ రూపంలోనైనా సమాచారమిచ్చి ఉంటే వారు తిరిగి విధుల్లో చేరినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. దీంతో లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలకు దూరమైన వారికి కొంత ఉపశమనం దొరికింది. కేంద్ర నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us