శ్రీలంక అధ్యక్షునిగా గొటాబయ రాజపక్షే.. తిరుగులేని విజయం

| Edited By: Ram Naramaneni

Nov 17, 2019 | 3:55 PM

శ్రీలంకలో సుమారు పదేళ్ల క్రితం తమిళ టైగర్ల పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన గొటాబయ రాజపక్షే లంక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప పాలక పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాసను ఓడించారు. రిటైర్డ్ సైనికాధికారి అయిన రాజపక్షేకి 49.6 శాతం, ప్రేమదాసకు 44.4 శాతం ఓట్లు లభించాయి. రాజపక్షేను ఆయన కుటుంబం..  ముద్దుగా  ‘ టర్మినేటర్ ‘ అని పిలుచుకుంటోంది. . కొలంబోలోని మూడు చర్చీలు, హోటళ్లలో ఏడు నెలల క్రితం ఈస్టర్ […]

శ్రీలంక అధ్యక్షునిగా గొటాబయ రాజపక్షే.. తిరుగులేని విజయం
Follow us on

శ్రీలంకలో సుమారు పదేళ్ల క్రితం తమిళ టైగర్ల పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన గొటాబయ రాజపక్షే లంక అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప పాలక పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాసను ఓడించారు. రిటైర్డ్ సైనికాధికారి అయిన రాజపక్షేకి 49.6 శాతం, ప్రేమదాసకు 44.4 శాతం ఓట్లు లభించాయి. రాజపక్షేను ఆయన కుటుంబం..  ముద్దుగా  ‘ టర్మినేటర్ ‘ అని పిలుచుకుంటోంది. . కొలంబోలోని మూడు చర్చీలు, హోటళ్లలో ఏడు నెలల క్రితం ఈస్టర్ సందర్భంగా టెర్రర్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు ఈ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. 2005… 15 మధ్య కాలంలో అధ్యక్షుడిగా ఉన్న వివాస్పదుడైన మహిందా రాజపక్షేకి గొటాబయ సోదరుడు. దేశంలో మత తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తానంటూ గొటాబయ చేసిన ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. ఏమైనా.. ప్రధాని రనిల్ విక్రమ సింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీకి ఇది తొలి పాపులర్ టెస్ట్.. గతంలో రాజపక్షే రక్షణ శాఖ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు.