AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోపీచంద్ ‘సీటీమార్’ మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభం.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..

హీరో గోపీచంద్, డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర...

గోపీచంద్ 'సీటీమార్' మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభం.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..
Ravi Kiran
|

Updated on: Nov 24, 2020 | 9:29 PM

Share

Gopichand Seetimaar: హీరో గోపీచంద్, డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా కోసం ప్రొడ‌క్ష‌న్ టీం స్పెష‌ల్ గా వేసిన భారీ సెట్ లో చేస్తున్న‌ ఏర్పాట్ల‌కు సంబంధించిన వీడియోను విడుద‌ల చేశారు. అవ‌స‌ర‌మైన అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జ‌రిపి చిత్రీక‌ర‌ణ పూర్తిచేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన గోపీచంద్, త‌మ‌న్నాల లుక్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న సూర్యవంశీ నటిస్తోంది. అలాగే సీనియర్ నటి భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..