ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సీఈవో గోపాల్‌కృష్ణ ద్వివేది అన్నారు. ఉదయం 8గం.లకు కౌంటింగ్‌ను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపును ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మధ్యాహ్నం 12గం.లకు ట్రెండ్ తెలిసిపోతుందని, గురువారం అర్దరాత్రికి మొత్తం ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. 2గం.ల వరకు తొలి ఫలితం తేలిపోతుందని ఆయన పేర్కొన్నారు. వీఎంలలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీ ప్యాట్లు లెక్కిస్తామని, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత రీ పోలింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని ద్వివేది అభిప్రాయపడ్డారు.