స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా వన్‌ప్లస్ బ్రాండ్ ఫోన్స్‌ను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆ ఫోన్స్ వచ్చే కెమెరా క్వాలిటీతో పాటు ఇతర ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే ఇతర ఫోన్స్‌తో పోల్చుకుంటే వన్‌ప్లస్ ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వన్‌ప్లస్ ఫోన్లను ఇష్టపడే వారు ఇతర ఆఫర్లతో కలిపి వన్‌ప్లస్ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం వన్ ప్లస్ బ్రాండ్ 5 జీ అప్‌గ్రేడ్ డేస్‌ను ప్రారంభించింది. మార్చి 21న ప్రారంభమైన ఈ సేల్ ఏప్రిల్ 2 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లపై అద్భుతమైన తగ్గింపు ధరలతో ఆకర్షనీయమైన ఎక్స్చేంజ్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లు తమ పాత 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకుని, వనప్లస్ నుంచి నుండి సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో అందుబాటులో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
వన్ ప్లస్ 11 ఇటీవలి కాలంలో కంపెనీ అందిస్తున్న తాజా ప్రీమియం స్మార్ట్‌ఫోన్. మీరు 4 జీ వన్ ప్లస్, ఐఓఎస్ డివైజ్‌లను కలిగి ఉంటే దాదాపు 5000 రూపాయల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. మరోవైపు ఇతర 4 జీ ఆండ్రాయిడ్ పరికరాలపై రూ.3000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ ద్వారా 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో వస్తుంది. అలాగే వన్ కార్డ్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకూ తక్షణ తగ్గింపు వస్తుంది. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.
ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 3000 ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పొందవచ్చు. అలాగే వన్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.1750 తక్షణ తగ్గింపు పొందవచ్చు. అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్స్ ద్వారా 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులు ఫోన్‌పై తక్షణ తగ్గింపు రూ. 2000 పొందుతారు. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లలో కొనుగోలుదారులు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐను పొందుతారు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా పొందుతారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌పై తక్షణం రూ.1500 తగ్గింపు పొందుతారు. ఐసీఐసీఐ పేపర్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో 18 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై మీరు రూ. 3,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందుతారు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్‌పై రూ.1250 తక్షణ తగ్గింపు పొందుతారు. అమెజాన్, వన్ ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలోని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లలో కొనుగోలుదారులు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐను పొందుతారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..