Today Gold Rates In Hyderabad: వరుస పెరుగుదలతో షాక్ ఇస్తున్న పసిడి.. నేడు కూడా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ ఎంత పెరిగిందంటే..

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ధరలు తగ్గుతాయని భావించిన బంగారం ప్రియులకు పుత్తడి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.

Today Gold Rates In Hyderabad: వరుస పెరుగుదలతో షాక్ ఇస్తున్న పసిడి.. నేడు కూడా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ ఎంత పెరిగిందంటే..

Edited By:

Updated on: Dec 19, 2020 | 11:20 AM

Today Gold Rates In Hyderabad: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ధరలు తగ్గుతాయని భావించిన బంగారం ప్రియులకు పుత్తడి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. వరుసగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు గోల్డ్ అందని ద్రాక్షగా మారిపోతోంది. ఆగస్టు నెల తొలి నుంచి పడిపోతూ వచ్చిన బంగారం ధరలు.. నవంబర్ తరువాత పుంజుకున్నాయి. డిసెంబర్ 1 నుంచి వరుసగా పుత్తడి ధరలు పెరుగూతు వస్తున్నాయి. ఇవాళ కూడా పడిసి ధరలు అమాంతం పెరిగాయి. తాజాగా రూ. 450 పెరిగి.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 51,050కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారానికి రూ.400 పెరిగడంతో 10 గ్రాముల పడిసి రూ. 46,800 లకు జంప్ అయ్యింది.

ఇక న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి ధర 1888 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ మార్కెట్‌లో చూసుకుంటే 1,882 డాలర్లు నడుస్తోంది. ఇది నెల రోజుల్లో గరిష్టమని నిపుణులు చెబుతున్నారు. కాగా, దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 50వేలను దాటి మరింత పెరుగుదల వైపు పురుగులు తీస్తోంది. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ. 50, 290 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

Also read:

ఆదిలాబాద్ గన్ ఫైర్ రియాక్షన్స్ : తుపాకీతో ఇద్దరిని కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్‌, స్పందించిన ఓవైసీ బ్రదర్స్

ఏపీ స‌ర్కార్ ప‌ట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ఈనెల 25వ తేదీ నుంచి ఇళ్ల ప‌ట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జ‌గ‌న్