బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత ఐదు వారాలుగా 2 వేలకు పైగా ధర తగ్గింది. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారు ఆసక్తి చూపుతుండగా, అటు వర్తకులు మాత్రం డోలాయమానంలో పడిపోయారు. ట్రేడర్ల దగ్గర నిధుల కొరతే గోల్డ్ రేటు తగ్గడానికి కారణమని భావిస్తున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ముంబైలోని పది గ్రాముల బంగారం ధర 32,600లుగా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర 32,700లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర 32, 645గా ఉంది. ఐదు వారాల క్రితం ఈ ధర 34,680గా ఉండేది.