బుధవారంతో పోల్చుకుంటే ఇవాళ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. దేశీయ మార్కెట్లో గురువారం ఉదయం బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,000కు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పుత్తడి ధరలలో మార్పులు జరిగాయి. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,000కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.52,250కు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750దగ్గర ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,900గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,900గా ఉంది. అటు చెన్నై మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,170 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,570గా ఉంది.
Also Read:
Vodafone Prepaid Plan: వోడాఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో ఉచితంగా 50జీబీ డేటా ఉచితం