Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..

|

Jan 14, 2021 | 1:13 PM

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని

Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..
Follow us on

Gold and Silver Rates: బంగారం ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం ధరలు కాస్త పెరిగాయని చెప్పవచ్చు. నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,200 ఉంది. నిన్నటితో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,400 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-46,200, విశాఖ-46,200 , విజయవాడ-46,200, ముంబై-48,460, చెన్నై-46,620, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-46,200, కోల్‌కతా-48,990.
ఇక ఇవాటి వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,700 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర కాస్త పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.707 ఉంది. వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.707, విజయవాడ-707, విశాఖ-707, ముంబై-663, చెన్నై-703, న్యూఢిల్లీ-663, బెంగళూరు-665, కోల్‌కతా-రూ.663.

జల్లికట్టు పోటీలను వీక్షించడానికి మధురైకి రాహుల్‌ గాంధీ.. అలాంగనల్లూర్‌లో పోటీలను ప్రారంభించనున్న సీఎం..

Silver Rates Today: పరుగులు పెడుతున్న వెండి.. పెరుగుతున్న సిల్వర్ ధరలు.. కిలో రేటు ఎంతంటే ?