ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!

|

Oct 14, 2020 | 5:51 PM

మధ్యప్రదేశ్‌లోని రాత్లాం నగరంలో మహాలక్ష్మీ ఆలయానికి ఎక్కడా లేని విశిష్టత ఉంది. ఈ ఆలయంలో మాత్రం భక్తులకు బంగారు, వెండి నాణేలను ప్రసాదంగా ఇస్తారు.

ఆ గుడిలో భక్తులకు బంగారమే ప్రసాదం.!
Follow us on

Gold Coins As Prasad In This Temple: మధ్యప్రదేశ్‌లోని రాత్లాం నగరంలో మహాలక్ష్మీ ఆలయానికి ఎక్కడా లేని విశిష్టత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాల్లో భక్తులకు ప్రసాదంగా ఆహార పొట్లాలు, లేదా పానీయం ఇస్తుంటారు. అయితే ఈ ఆలయంలో మాత్రం భక్తులకు బంగారు, వెండి నాణేలను ప్రసాదంగా ఇస్తారు. కొన్ని దశాబ్దాల కిందట మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. దీపావళీ రోజుల్లో ఈ ఆలయం అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది.

ఆ రోజున ఆలయం తలుపులు 24 గంటలు తెరుచుకుని ఉంటాయి. ప్రతీ ఏటా దీపావళీ రోజుల్లో ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలు, డబ్బును కానుకలుగా సమర్పిస్తుంటారు. దాదాపు సంవత్సరానికి రూ. 100 కోట్ల విలువైన కానుకలు వస్తాయని అంచనా. ఆ సమయంలో భక్తులకు మహాలక్ష్మీ అమ్మవారు డబ్బూ, బంగారం మధ్య దర్శనమిస్తుంది.

దీపావళీకి ముందు అక్కడ ధన త్రయోదశి ఉత్సవాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. అప్పుడే భక్తులకు బంగారు నాణేలను ప్రసాదంగా ఇస్తారు. వాటిని భక్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం లాంటివి చేయరు. వారు ఆ నాణేలను పూజ గదిలో పెట్టి పూజించడం, లేదా బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవడం వంటివి చేస్తారు. అలా చేస్తే తమ ఇంట్లో మహాలక్ష్మీ కొలువు తీరుతుందని వారి నమ్మకం. అంతేకాదు ఆలయాన్ని దర్శించుకున్న ఏ భక్తుడూ కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరని అంటుంటారు.

Also Read: ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!