గోవా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

|

Sep 02, 2020 | 12:50 PM

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరిని పట్టి పీడిస్తోంది. తాజాగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ కూడా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు...

గోవా ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
Follow us on

Goa Chief Minister Dr. Pramod Sawant  : కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖల వరకు అందరిని పట్టి పీడిస్తోంది. తాజాగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ కూడా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని  నిర్ధార‌ణ అయింద‌ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే తనకు క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉంటున్న‌ట్లు గోవా ముఖ్యమంత్రి  తెలిపారు. ఇంటి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తాన‌ని  వెల్లడించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సీఎం సావంత్ విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అయితే రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సోమవారం కూడా కొత్తగా 588 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18006కు చేరింది. అందులో 13850 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 3,962 యాక్టివ్ కేసులున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా గోవాలో క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 194కు చేరింది. తాజాగా నిన్న ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ఈ వివరాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. ఇటీవల కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.