గో ఎయిర్ సంస్థ నుంచి వైదొలగిన సీనియర్ అధికారులు

|

Aug 20, 2020 | 2:58 PM

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు బడా సంస్థలు ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగులుతున్నారు.

గో ఎయిర్ సంస్థ నుంచి వైదొలగిన సీనియర్ అధికారులు
Follow us on

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు బడా సంస్థలు ఉద్యోగుల్లో కోతలు విధిస్తున్నాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఈ ప్రభావం విమానయాన సంస్థలపై కూడా పడింది. ప్రస్తుతం విమానయానరంగం పరిస్థితిని అంచనా వేస్తూ వ్యయం తగ్గించుకునేందుకు గో ఎయిర్ సంస్థ చర్యలు తీసుకుంటోంది. గోఎయిర్ విమానయాన సంస్థలో ఆరుగురు సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. కరోనా సంక్షోభం వల్ల విమాన సర్వీసుల రాకపోకలు నిలిచిపోవడంతో గోఎయిర్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వాడియా గ్రూప్ ప్రమోట్ చేసిన గో ఎయిర్ లో 6,700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, కరోనా సంక్షోభం వల్ల 4వేల మంది ఉద్యోగులు జీతం లేకుండా సెలవులో వెళ్లినట్లు సమాచారం. మార్చి నెలలో చాలా మంది ఉద్యోగులకు వేతన కోతలు ప్రకటించిన గోఎయిర్ 60 శాతం సిబ్బందికి ఎల్‌డబ్ల్యూపీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంక్షోభంతో గోఎయిర్ సీనియర్ ఉద్యోగులు రాజీనామా చేశారని విమానయాన వర్గాలు వెల్లడించాయి. గోఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దూబే స్థానంలో కౌశిక్ ఖోనాను నియమించింది. ఈ క్రమంలో మరిన్ని విమానయాన సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గించుకునే పనిలోపడ్డట్లు సమాచారం.