బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ పై మరింత భద్రత: జిహెచ్‌ఎంసి

బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌లో అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నియంత్రించడానికి వన్ వే ఫ్లైఓవర్‌పై భద్రతా అంశాలను కట్టుదిట్టం చేశారు. ఫ్లైఓవర్‌లోని ఏడు ప్రదేశాల వద్ద రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక వాహనం వాటిపైకి వెళ్ళినప్పుడు, టైర్లు శబ్దం చేస్తాయి. ఇది వేగ పరిమితుల గురించి డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ప్రస్తుతం, 900 మీటర్ల ఫ్లైఓవర్‌పై రెండు రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఒకటి […]

బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ పై మరింత భద్రత: జిహెచ్‌ఎంసి

Edited By:

Updated on: Dec 24, 2019 | 1:17 AM

బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌లో అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలను నియంత్రించడానికి వన్ వే ఫ్లైఓవర్‌పై భద్రతా అంశాలను కట్టుదిట్టం చేశారు. ఫ్లైఓవర్‌లోని ఏడు ప్రదేశాల వద్ద రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేశారు.

ఒక వాహనం వాటిపైకి వెళ్ళినప్పుడు, టైర్లు శబ్దం చేస్తాయి. ఇది వేగ పరిమితుల గురించి డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ప్రస్తుతం, 900 మీటర్ల ఫ్లైఓవర్‌పై రెండు రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లైఓవర్ ఆరంభంలో, మరొకటి 50 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సి) నిబంధనలను సక్రమంగా పాటించి ఫ్లైఓవర్‌ను నిర్మించామని, ఫ్లైఓవర్ రూపకల్పనలో తప్పు లేదని అధికారులు తెలిపారు.