GHMC Elections Results 2020 : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు..సికింద్రాబాద్‌లో మందకొడిగా కౌంటింగ్‌..పలుచోట్ల గొడవలు

|

Dec 04, 2020 | 10:54 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి, 30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గాంధీనగర్‌ డివిజన్‌, రాంనగర్‌, రామంతాపూర్‌లలో కౌంటింగ్‌ కొనసాగుతుండగా..

GHMC Elections Results 2020 : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు..సికింద్రాబాద్‌లో మందకొడిగా కౌంటింగ్‌..పలుచోట్ల గొడవలు
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి, 30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. గాంధీనగర్‌ డివిజన్‌, రాంనగర్‌, రామంతాపూర్‌లలో కౌంటింగ్‌ కొనసాగుతుండగా, సికింద్రాబాద్‌ జోన్‌ మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది.

కాగా, హయత్‌నగర్‌ కౌంటింగ్‌ కేంద్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఏజెంట్ల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏవీ కాలేజ్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని సీపీ అంజనీకుమార్‌ పరిశీలించారు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద పరిస్థితిని సమీక్షించారు. పోస్టల్‌ బ్యాలెట్స్‌లో ఎక్కువగా చెల్లని ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే, మధ్యాహ్నంలోగా గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది