GHMC Election Result 2020 : కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన అధికారులు .. మాస్క్ లు లేకుండా విధుల్లోకి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. విజయం పై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.

GHMC Election Result 2020 : కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన అధికారులు .. మాస్క్ లు లేకుండా విధుల్లోకి

Updated on: Dec 04, 2020 | 11:02 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. విజయం పై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ పీఠం ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ లీడింగ్ లో ఉన్నది. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉండగా ఎంఐఎం మూడో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసారు అధికారులు. చందా నగర్ లోని పీజేఆర్ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రంలో మాస్క్ లు లేకుండానే  కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సిబ్బంది తీరు పై కౌంటింగ్ ఏజెంట్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.