ధోని కంటే దేశం ముఖ్యం.. సెలెక్టర్లపై గంభీర్ ఫైర్!
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి ధోనిపై విరుచుపడ్డాడు. సెలెక్టర్లు సాధ్యమైనంత తొందరగా ధోని విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ధోని కంటే దేశం ముఖ్యమని.. అతడు ఆటకు వీడ్కోలు పలికేవరకు నిరీక్షించడం సబబు కాదని అన్నాడు. ఎవరికైనా రిటైర్మెంట్ అనేది తమ వ్యక్తిగతమని.. అయితే ఆ నిర్ణయం చెప్పేవరకు ఎదురు చూస్తూ ఉంటారా అని ప్రశ్నించాడు. వచ్చే వరల్డ్ కప్‌లో ధోని ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఆ తరుణంలో కెప్టెన్‌గా ఎవరున్నా ధోని […]

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి ధోనిపై విరుచుపడ్డాడు. సెలెక్టర్లు సాధ్యమైనంత తొందరగా ధోని విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ధోని కంటే దేశం ముఖ్యమని.. అతడు ఆటకు వీడ్కోలు పలికేవరకు నిరీక్షించడం సబబు కాదని అన్నాడు. ఎవరికైనా రిటైర్మెంట్ అనేది తమ వ్యక్తిగతమని.. అయితే ఆ నిర్ణయం చెప్పేవరకు ఎదురు చూస్తూ ఉంటారా అని ప్రశ్నించాడు.
వచ్చే వరల్డ్ కప్‌లో ధోని ఆడతాడని నేను అనుకోవడం లేదు. ఆ తరుణంలో కెప్టెన్‌గా ఎవరున్నా ధోని మాత్రం జట్టులో ఉండదు. కాకపోతే వచ్చే వరల్డ్‌కప్‌కు అతడిని జట్టులోకి తీసుకోవడం కష్టమని ధోనికి చెప్పడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. ప్రస్తుతం యువ క్రికెటర్లను పరీక్షించేది దేశం కోసం తప్ప ధోని కోసం కాదని గంభీర్ స్పష్టం చేశాడు. యువ ఆటగాళ్లను సన్నద్ధం చేయడానికి ధోని తమకు ఒక అవకాశం ఇచ్చాడని సెలెక్టర్లు చెప్పడం విడ్డురంగా ఉందని తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ ఇప్పటినుంచే సంసిద్ధం కావాలి. రిషబ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహాలకు అవకాశాలు ఇవ్వాలి. ధోని లేని జట్టును టీమిండియా మేనేజ్‌మెంట్ చూసే టైమ్ వచ్చేసిందని గంభీర్ పేర్కొన్నాడు.




