కర్ణాటకలో కలకలం.. నిన్న ఐటీ రైడ్స్.. నేడు ఆత్మహత్య..!

కర్నాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రమేష్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరులోని జ్ఞానభారతి ప్రాంతంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర పర్సనల్ అసిస్టెంట్‌గా రమేష్ వ్యవహరిస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలపై పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పరమేశ్వర ఇళ్లతో పాటుగా.. మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ అర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. […]

కర్ణాటకలో కలకలం.. నిన్న ఐటీ రైడ్స్.. నేడు ఆత్మహత్య..!

Edited By:

Updated on: Oct 12, 2019 | 5:25 PM

కర్నాటక కాంగ్రెస్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రమేష్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరులోని జ్ఞానభారతి ప్రాంతంలో ఈ ఘటనకు పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర పర్సనల్ అసిస్టెంట్‌గా రమేష్ వ్యవహరిస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలపై పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పరమేశ్వర ఇళ్లతో పాటుగా.. మరో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ అర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు జరిపారు. పరమేశ్వర ఇంటితో పాటు విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే రమేష్ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. పరమేశ్వర, అతని సన్నిహితులు, బంధువుల ఇళ్లతో పాటు 30చోట్ల జరిపిన ఐటీ దాడుల్లో రూ. 4.25కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్‌ చేశారు.ఈ నేపథ్యంలో రమేష్ ఆత్మహత్య చేసుకోవడం.. సంచలనంగా మారింది.

అయితే రమేష్ ఇళ్లపై సోదాలు జరిపిన విషయంపై ఐటీ అధికారుల నుంచి స్పష్టత రాలేదు. రమేశ్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, రమేశ్‌ బలవన్మరణంపై పరమేశ్వర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ నివాసాలపై ఐటీ సోదాలు జరిగిన సమయంలో అతడు నాతోనే ఉన్నాడని.. ఏమీ జరగదు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేశ్‌కు ధైర్యం చెప్పానని పరమేశ్వర తెలిపారు. అతడు మృదుస్వభావి అని.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియట్లేదని విచారం వ్యక్తం చేశారు.