సెప్టెంబరు 1 నుంచి ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల కార్యకలాపాలు..?

| Edited By:

Aug 15, 2020 | 7:32 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలను క్రమంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సెప్టెంబరు 1 నుంచి ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల కార్యకలాపాలు..?
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలను క్రమంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడం, కోవిడ్-19 పరిస్థితులు చక్కబడటం మొదలైతే, నెమ్మదిగా ప్రత్యక్ష విచారణలను దశలవారీగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్ నేతృత్వంలోని హైకోర్టు పరిపాలన, సాధారణ పర్యవేక్షణ కమిటీ శనివారం ఈ అంశాలపై చర్చించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మనోజ్ జైన్ జారీ చేసిన ఆదేశాల్లో ఈ వివరాలు తెలిపారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ప్రజా రవాణా అందుబాటులోకి రావడం వంటి పరిస్థితులను సమీక్షించిన తర్వాత సెప్టెంబరు 1 నుంచి దశలవారీగా ప్రత్యక్ష విచారణలకు కోర్టులను తెరవాలని నిర్ణయించింది. మొదట్లో ప్రయోగాత్మకంగా నాలుగో వంతు కోర్టులను ప్రత్యక్ష కార్యకలాపాల కోసం తెరవాలని, మిగిలిన కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు నిర్వహించాలని, రొటేషన్ పద్ధతిలో ఈ విధంగా చేయాలని నిర్ణయించారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!