సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

|

Oct 26, 2020 | 5:30 PM

ఇప్పడు మేము చెప్పబోయే ఘటన అచ్చం సినిమాలోని పతాక సన్నివేశాన్ని తలపిస్తుంది. మూడోళ్ల చిన్నారిని అపహరించిన కిడ్నాపర్‌ను పట్టుకోడంతో పాటు, ఆ పాపను సురక్షితంగా అమ్మ ఒడిని చేర్చడానికి.. 

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ...
Follow us on

ఇప్పడు మేము చెప్పబోయే ఘటన అచ్చం సినిమాలోని పతాక సన్నివేశాన్ని తలపిస్తుంది. మూడోళ్ల చిన్నారిని అపహరించిన కిడ్నాపర్‌ను పట్టుకోడంతో పాటు, ఆ పాపను సురక్షితంగా అమ్మ ఒడిని చేర్చడానికి  ఓ రైలు ఎక్కడా ఆగకుండా 200 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్-లలిత్‌పూర్ మధ్య ప్రయాణించే రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..లలిత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. పాప తల్లిదండ్రులతో స్టేషన్‌లో అడుగుపెట్టగానే  కిడ్నాపర్ తన ప్లాన్‌ను అమలు చేశాడు. చిన్నారిని కిడ్నాప్ చేసి లలిత్‌పూర్ నుంచి భోపాల్ వెళ్తున్న రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కాడు. పాప కిడ్నాప్‌కు గురైన విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు..వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా లలిత్‌పూర్ స్టేషన్ రైల్వే పోలీసులు నిందితుడు చిన్నారితో సదరు రైలెక్కిన విషయాన్ని గుర్తించారు. అప్పటికే రైలు స్టేషన్ దాటి పరుగులు తీసింది. వెంటనే భోపాల్ స్టేషన్ రైల్వే ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చి రైలును ఆపకుండా భోపాల్ వరకు పరుగులు తీయించారు. కిడ్నాపర్ ప్లాన్‌ను భగ్నం చేశారు. రైలు తిన్నగా వెళ్లి భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. అప్పటికే స్టేషన్‌లో రెడీగా ఉన్న రైల్వే పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకుని బెండు తీశారు.

Also Read :

ఇది విన్నారా..! భర్తకు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించిన కోర్టు

అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఫేస్​బుక్ కీలక నిర్ణయం !