ఆన్‌లైన్ దిగ్గజాలపై ఫ్రాన్స్ సర్కార్ మొట్టికాయలు.. గూగుల్‌, అమెజాన్‌లకు భారీ జరిమానా.. మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశం

|

Dec 11, 2020 | 8:11 AM

ఆన్‌లైన్ దిగ్గజాలకు ప్రాన్స్ ప్రభుత్వం భారీగా షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాయంటూ గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది.

ఆన్‌లైన్ దిగ్గజాలపై ఫ్రాన్స్ సర్కార్ మొట్టికాయలు.. గూగుల్‌, అమెజాన్‌లకు భారీ జరిమానా..  మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశం
Follow us on

ఆన్‌లైన్ దిగ్గజాలకు ఫ్రాన్స్  ప్రభుత్వం భారీగా షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాయంటూ గూగుల్‌, అమెజాన్‌లకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. వినియోగదారుల డేటాను వారి అనుమతి లేకుండా ఆ సంస్థలు రికార్డు చేస్తున్నాయని ఫ్రాన్స్ అధికారులు  తేల్చారు. అంతేకాదు, వాటి ఆధారంగా ప్రకటనల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని ఫ్రాన్స్‌ డేటా భద్రత ఏజెన్సీ సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది. గత సెప్టెంబరులో చేసిన ఈ మార్పులు ఫ్రాన్స్‌ నిబంధనలకు అనుగుణంగా లేవని తెలిపింది. దీంతో గూగుల్‌కు రూ.892 కోట్లు, అమెజాన్‌కు 309 కోట్ల జరిమానా విధించామని వెల్లడించింది. 3 నెలల్లో జరిమానా చెల్లించకుంటే మరో రూ.కోటి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.