అస్సాంలో మళ్లీ లాక్ డౌన్ !

|

Jun 26, 2020 | 5:40 PM

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అస్సాం రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ముందస్తుగా అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కమ్రూప్ జిల్లాలో మరోసారి లాక్‌డౌన్ విధించింది. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

అస్సాంలో మళ్లీ లాక్ డౌన్ !
Follow us on

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు అస్సాం రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ముందస్తుగా అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కమ్రూప్ జిల్లాలో మరోసారి లాక్‌డౌన్ విధించింది. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది.

కరోనా కేసులు పెరుగుతున్న వేళ అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణకు అస్సాం రాజధాని గౌహతిలో రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. సోమవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ కొనసాగనుంది. అలాగే అస్సాం మొత్తం ఈ రెండు వారాలు రాత్రి పూట 7 గంటల నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుందని అసోం ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. గౌహతి సిటీలో ఎలాంటి వాహనాల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేసింది. గ్రాసరీ స్టోర్స్, హాస్పిటల్స్, ఫార్మసీలు, బ్యాంకులు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది. 14 రోజుల లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

గౌహతిలో ఇప్పటివరకు 762 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 677 కేసుల్లో బాధితులకు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. ఈ కేసులన్నీ జూన్ 15 తర్వాతే నమోదవడం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో అసోంలో కేసుల సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. జూన్ 15 తర్వాత వైరస్ వ్యాప్తి అనూహ్యంగా పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో మహమ్మారి వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటిగా అస్సాం ఉంది. కరోనా బారిన పడి అస్సాంలో 9 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం తెలుస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి వలస కార్మికులు, విద్యార్థులు, ఇతరులకు స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన తర్వాత గౌహతిలో వైరస్ వ్యాప్తి పెరిగింది. బయట నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వైరస్ సోకిందని మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు.

అసోంలో గురువారం 276 కేసులు నమోదు కాగా.. వీటిలో 133 కేసులు గౌహతిలోనే ఉన్నాయి. ‘ఇక వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాం. 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తాం. వారం తర్వాత సమావేశం నిర్వహించి పరిస్థితి సమీక్షిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ తెలిపారు.