తమిళనాడులో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!

| Edited By:

Dec 14, 2019 | 2:50 AM

తమిళనాడులోని దిండిగల్‌లో రైల్వే ట్రాక్ వద్ద ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు మృతిచెందారు. మృతదేహాల దగ్గర దొరికిన ఐడి ప్రూఫ్‌ల ఆధారంగా వారిని ఉత్తరాపతి (40), సంగీత (37), అభినయశ్రీ (18), ఆకాష్ (13) గా రైల్వే పోలీసులు గుర్తించారు. తిరుచ్చి నుండి వచ్చిన ఆ కుటుంబం కొడైకెనాల్‌ను సందర్శించి తిరిగి వెళ్తుండగా.. అతివేగంగా వెళ్లే రైలు ముందుకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌ పై నాలుగు మృతదేహాలు ఉన్నట్లు తెలియడంతో రైల్వే పోలీసులు […]

తమిళనాడులో దారుణం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!
Follow us on

తమిళనాడులోని దిండిగల్‌లో రైల్వే ట్రాక్ వద్ద ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు మృతిచెందారు. మృతదేహాల దగ్గర దొరికిన ఐడి ప్రూఫ్‌ల ఆధారంగా వారిని ఉత్తరాపతి (40), సంగీత (37), అభినయశ్రీ (18), ఆకాష్ (13) గా రైల్వే పోలీసులు గుర్తించారు. తిరుచ్చి నుండి వచ్చిన ఆ కుటుంబం కొడైకెనాల్‌ను సందర్శించి తిరిగి వెళ్తుండగా.. అతివేగంగా వెళ్లే రైలు ముందుకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌ పై నాలుగు మృతదేహాలు ఉన్నట్లు తెలియడంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబానికి అప్పులు ఉండడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండవచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.