Flash: కరోనా సోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి..

| Edited By:

Apr 14, 2020 | 3:10 PM

క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. దీని భారిన‌ప‌డి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్రాణాలు విడిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్​క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50).. కోవిడ్ తో బాధ‌ప‌డుతూ మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచాడు. గత 3 రోజుల నుంచి పెషావర్​లోని ఓ హాస్ప‌ట‌ల్ ఐసీయూలో ఉన్న‌ జాఫర్.. క‌రోనాతో మరణించిన తొలి పాకిస్థాన్ క్రికెటర్. 10 నెలల క్రితం క్యాన్సర్ పై పోరాడి ప్రాణాలు విడిచిన‌ పాక్ మాజీ ఆటగాడు అక్తర్ […]

Flash: కరోనా సోకి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మృతి..
Follow us on

క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతోంది. దీని భారిన‌ప‌డి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్రాణాలు విడిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫస్ట్​క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50).. కోవిడ్ తో బాధ‌ప‌డుతూ మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచాడు. గత 3 రోజుల నుంచి పెషావర్​లోని ఓ హాస్ప‌ట‌ల్ ఐసీయూలో ఉన్న‌ జాఫర్.. క‌రోనాతో మరణించిన తొలి పాకిస్థాన్ క్రికెటర్. 10 నెలల క్రితం క్యాన్సర్ పై పోరాడి ప్రాణాలు విడిచిన‌ పాక్ మాజీ ఆటగాడు అక్తర్ సర్ఫరాజ్ ఇతడికి సోదరుడు.

1988లో క్రికెట్ కెరీర్​ ప్రారంభించిన సర్ఫరాజ్.. పెషావర్​ తరఫున 15 ఫస్ట్ ​క్లాస్ మ్యాచ్​ల్లో 616 ర‌న్స్ చేశాడు. 6 వన్డేలాడి 96 ర‌న్స్ సాధించాడు. 1994లో రిటైర్మెంట్​ ప్ర‌క‌టించాడు. అనంతరం 2000 సంవత్సరంలో పెషావర్​కు చెందిన సీనియర్, అండర్-19 జట్లకు కోచ్​గానూ సేవ‌లందించాడు.