మూడు రాజధానులు.. ముగ్గురు సీఎంలు.. మాజీ మంత్రి సరికొత్త డిమాండ్!

|

Jan 04, 2020 | 7:53 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. ఒకవేళ అది సాథ్యం కానీ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అలా […]

మూడు రాజధానులు.. ముగ్గురు సీఎంలు.. మాజీ మంత్రి సరికొత్త డిమాండ్!
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన నిర్ణయాన్ని సమర్దిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అటు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డి సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. ఒకవేళ అది సాథ్యం కానీ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక నగరం తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. అలా గానీ కుదరకపోతే చిత్తూరు జిల్లాను తీసుకెళ్లి కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే పక్షంలో.. ముగ్గురు ముఖ్యమంత్రులను కూడా నియమించాలని అమర్‌నాధ్ రెడ్డి డిమాండ్ చేశారు.