ఫ్రాన్స్‌ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలుశిక్ష.. జరిమానా

|

Jun 30, 2020 | 4:40 PM

ఫ్రాన్స్‌ మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిల్లోన్‌ (66) తన భార్యాపిల్లల కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు పారిస్‌ న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు ఫ్రాంకోయిస్‌ ఫిల్లోన్‌కు ఐదేళ్లు పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఆయన భార్య పెనెలోప్‌ ఫిల్లన్‌ (64)కు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు ఇద్దరికీ 4,23,100 డాలర్ల చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పు నిచ్చింది న్యాయస్థానం.

ఫ్రాన్స్‌ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలుశిక్ష.. జరిమానా
Follow us on

ఫ్రాన్స్‌ మాజీ ప్రధాని ఫ్రాంకోయిస్‌ ఫిల్లోన్‌ (66) తన భార్యాపిల్లల కోసం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు పారిస్‌ న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు ఫ్రాంకోయిస్‌ ఫిల్లోన్‌కు ఐదేళ్లు పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఆయన భార్య పెనెలోప్‌ ఫిల్లన్‌ (64)కు మూడేండ్ల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతో పాటు ఇద్దరికీ 4,23,100 డాలర్ల చొప్పున జరిమానా కూడా విధిస్తూ తీర్పు నిచ్చింది న్యాయస్థానం.
2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ ప్రధానిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇదే సమయంలో సొంత భార్యాపిల్లలు తనకు సహాయకులుగా పని చేస్తున్నట్లు చూపించి వారికి 10 లక్షల యూరోల దాదాపు రూ.8.5 కోట్లు లబ్ధి కలిగించారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువరించింది ఫ్రాన్స్ కోర్టు. జైలుశిక్షతో పాటు పదేళ్లు ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది కోర్టు. అయితే తీర్పుపై అపీలుకు వెళ్లనున్నట్లు ఫిల్లన్‌ దంపతులు ప్రకటించారు.