నూతన విద్యా విధానం 2020: మోదీ ఐడియాను స్వాగతించిన ఫారిన్ యూనివర్సిటీలు..

|

Aug 01, 2020 | 1:07 AM

కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాతీయ విద్యా విధానానికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

నూతన విద్యా విధానం 2020: మోదీ ఐడియాను స్వాగతించిన ఫారిన్ యూనివర్సిటీలు..
Follow us on

National Educational Policy 2020: విద్యా విధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జాతీయ విద్యా విధానం 2020కి తాజాగా మోదీ కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలను చేయడమే కాకుండా… 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాతీయ విద్యా విధానానికి విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ కొత్త విద్యా పాలసీ వల్ల అనేక ఫారిన్ యూనివర్సిటీలు భారతదేశంలో క్యాంపస్‌లు తెరుచుకునే అవకాశం దొరికింది. హార్వర్డ్, ఆక్స్‌ఫోర్డ్‌ వంటి ప్రధాన విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు తెరుస్తాయా.? లేదా.? అనేది చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. నూతన విద్యా విధానం ద్వారా మోదీ ప్రభుత్వం కొత్త ఒరవడికి నాంది పలకబోతోందని చెప్పవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు విద్యా విధానం పునరుద్దరణలో ఇదొక బిగ్ స్టెప్ అని నిపుణులు అంటున్నారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై ఫ్రాన్స్‌కు చెందిన బిజినెస్ స్కూల్ మేనేజర్ మాట్లాడుతూ.. ”విదేశీ విశ్వవిద్యాలయాల కార్యకలాపాలను భారత్‌లో ప్రారంభించేలా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యలో భారీ సంస్కరణలను తీసుకొస్తుంది. అంతేకాకుండా నాణ్యమైన విద్య, కరిక్యులమ్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి”. జూలై 29న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించిన కేంద్ర కేబినేట్.. ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాలు కొత్త చట్టం ప్రకారం భారత్‌లో కార్యకలాపాలు సాగించవచ్చునని పేర్కొంది.

5వ తరగతి వరకు మాతృభాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించుకోవాలనే ప్రేరణ విద్యార్థులలో మంచి విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడానికి సహపడనుంది. జాతీయ విద్యా విధానం 2020 వల్ల విద్యలో సరికొత్త మార్పులు రానున్నాయి. టెక్నాలజీ ఆధారిత విద్యపై ఇది ఎక్కువగా ఫోకస్ చేయనుందని అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ విశ్వవిద్యాలయాల ప్రతినిధి ఆదిత్య మల్కాని పేర్కొన్నారు.

Also Read:

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.

ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!