కరోనా మరణాల్లో ఏపీ స్థానం ఇదీ..

దేశంలో 70 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల..

కరోనా మరణాల్లో ఏపీ స్థానం ఇదీ..

Updated on: Sep 08, 2020 | 7:26 PM

దేశంలో 70 శాతం కరోనా మరణాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల విషయంలోనూ ఈ ఐదు రాష్ట్రాల నుంచే 62 శాతం కేసులు వస్తున్నాయని తెలిపింది. మొత్తంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని.. ఆగస్టు మొదటివారంలో 2.15 శాతం ఉంటే ఇప్పుడది 1.70 శాతానికి వచ్చిందని పేర్కొంది. దేశం మొత్తంమీద 5 వేలకు తక్కువగా కొవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 14 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాల రేటు జాతీయ సగటు 1.70 శాతం కన్నా ఎక్కువగా ఉందని రాజేశ్ వివరించారు. దేశంలో ప్రతి 10 లక్షల మందిలో 53 కరోనా మరణాలు సంభవిస్తున్నాయని, ప్రపంచంలో అతి తక్కువ మరణాలు నమోదవుతున్న దేశాల్లో మనమూ ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us