లాక్‌డౌన్‌ వేళ విషాదం.. ట్రక్కు బోల్తాపడి ఐదుగురు మృతి

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేల.. మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌ జిల్లా సమీపంలోని ఓ గ్రామంలో ట్రక్కు బోల్తా పడటంతో.. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో పదకొండు మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి యూపీకి మామిడిపండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. నర్సింగ్ పూర్ సమీపంలోని గ్రామంలో బోల్తా పడిందని […]

లాక్‌డౌన్‌ వేళ విషాదం.. ట్రక్కు బోల్తాపడి ఐదుగురు మృతి

Edited By:

Updated on: May 10, 2020 | 10:42 AM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేల.. మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్‌ జిల్లా సమీపంలోని ఓ గ్రామంలో ట్రక్కు బోల్తా పడటంతో.. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో పదకొండు మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి యూపీకి మామిడిపండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి.. నర్సింగ్ పూర్ సమీపంలోని గ్రామంలో బోల్తా పడిందని జిల్లా కలెక్టర్ దీపక్ సక్సెనా తెలిపారు. ఘటన జరిగిన సమయంలో లారీలో మొత్తం పద్దెనిమిది మంది కూలీలు ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

ఇదిలావుంటే.. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులను ఇవ్వడంతో రోడ్లపైకి వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యం షాపులు కూడా తెరవడంతో.. మళ్లీ ప్రమాదాలు పెరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.