వల వేసిన ప్రతిసారి మత్సకారుడు ఖరీదైన చేపలు చిక్కాలని ఆశగా కోరుకుంటాడు. భారీ విలువతో పాటు దాని బరువు కూడా భారీగా ఉంటే..ఆ మత్సకారుడి ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుడికి వలకు సరైన చేప చిక్కింది. అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన బొమ్మిడి సత్యనారాయణ వైనతేయ వారధి వద్ద వల వేయగా.. 10 కేజీల బరువున్న పండుగప్ప చేప చిక్కింది. దీనిని స్థానికులు రూ. ఐదు వేలకు కొనుగోలు చేశారు. విషయం తెలియడంతో ఈ భారీ చేపను చూడటానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. గోదావరిలో ఇలా భారీ పండుగప్పలు చిక్కడం చాలా అరుదని మత్య్సకారులు చెబుతున్నారు.
మార్కెట్‌లో ఈ పండుగప్పకు మంచి విలువ ఉంటుంది. పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా తింటారని స్థానికులు చెబుతున్నారు. ఈ అరుదైన చేపలు చిక్కితే మత్స్యకారుల సంతోషం అంతా ఇంతా కాదు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారులకు ఇటీవల అరుదైన చేపలు లభించడం చూస్తూనే ఉన్నాం. అరుదైన చేపలు చిక్కితే వాటిని దక్కించుకునేందుకు..మాంసం ప్రియులు కూడా అంతే ఇంట్రస్ట్ చూపిస్తారు.
Also Read :
Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్
Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…
Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..