మునిసిపల్ ఎన్నికల్లో తొలి అడుగు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రహసనంలో మరో అడుగు ముందుకు పడింది. పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. వార్డుల రిజర్వేషన్లను ముగించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒక శాతం కంటే తక్కువగా వున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోను వారికి ఒక వార్డును రిజర్వు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కేటాయించారు. రిజర్వేషన్ల […]

మునిసిపల్ ఎన్నికల్లో తొలి అడుగు

Updated on: Jan 04, 2020 | 2:46 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రహసనంలో మరో అడుగు ముందుకు పడింది. పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. వార్డుల రిజర్వేషన్లను ముగించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒక శాతం కంటే తక్కువగా వున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోను వారికి ఒక వార్డును రిజర్వు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కేటాయించారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి పంపారు. ఈ రిజర్వేషన్లను జిల్లాల వారీగా కలెక్టర్లు జనవరి 5వ తేదీన వెల్లడిస్తారు. మరోవైపు మునిసిపల్ రిజర్వేషన్లపైనా, షెడ్యూల్ పైనా అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైదరాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నివేదికలను సోమవారం హైకోర్టులో దాఖలు చేసే అవకాశముందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.