గ్రహణానికి ముందు మెరిసిపోయిన చంద్రుడు.. ఎలా ఉన్నాడో మీరే చూడండి…

|

May 26, 2021 | 5:42 PM

Supermoon Rises Over New Zealand: సూపర్ బ్లడ్ ​మూన్​ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్​లో నిండు జాబిల్లి కనువిందు చేసింది. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు.

గ్రహణానికి ముందు మెరిసిపోయిన చంద్రుడు.. ఎలా ఉన్నాడో మీరే చూడండి...
Supermoon Rises Over New Ze
Follow us on

సూపర్​ బ్లడ్​ మూన్​కు ముందు న్యూజిలాండ్​లో జాబిల్లి ప్రకాశవంతంగా మెరిసిపోయింది. గ్రహణం తర్వాత ఎరుపు, నారింజ రంగుల్లో చంద్రుడు వెలిగిపోనున్నాడు. సూపర్ బ్లడ్ ​మూన్​ ఏర్పడటానికి ముందు న్యూజిలాండ్​లో నిండు చందమామ కనువిందు చేశాడు. గ్రహణం తర్వాత అరుణ వర్ణంతో చంద్రుడు మెరిసిపోనున్నాడు. 15 నిమిషాల పాటు సూపర్ బ్లడ్ మూన్ కనిపించనుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని చిత్రీకరించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు చంద్ర గ్రహణం మొదలైంది. సాయంత్రం 6.22 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించనున్నాడు. సూర్యుడి ప్రకాశం వల్ల ఈ రంగులు ఏర్పడనున్నాయి. భారత్​లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది.

న్యూజిలాండ్​తో పాటు ఆస్ట్రేలియా, ఇతర పసిఫిక్, తూర్పు ఆసియా దేశాలలో సూపర్ బ్లడ్ మూన్​ను చూసే అవకాశం ఉంది. హవాయీ దీవులు, ఉత్తర అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున ఇది కనిపించనుంది. అమెరికా తూర్పు తీర ప్రాంతాలు సహా ఐరోపా, ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లేదు.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..