గుడ్ న్యూస్: మోడెర్నా వ్యాక్సిన్‌ తొలి దశ ట్రయల్స్ సక్సెస్..!

| Edited By:

Jul 15, 2020 | 2:35 PM

కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో.. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా ప్రాథమిక క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు

గుడ్ న్యూస్: మోడెర్నా వ్యాక్సిన్‌ తొలి దశ ట్రయల్స్ సక్సెస్..!
Follow us on

First Coronavirus Vaccine Tested: కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో.. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ కీలక ప్రకటన చేసింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా ప్రాథమిక క్లినికల్‌ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది. తొలిదశలో భాగంగా 45 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు తెలిపింది. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి వీరిలో ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది. ఈ మేరకు ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో తమ పరిశోధనా ఫలితాల్ని ప్రచురించింది.

యుఎస్ కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ రెండు డోసులు అందుకున్న వారిలో కరోనా వైరస్‌ను అంతం చేయగలిగే ప్రతిరక్షకాలు(యాంటీబాడీలు) భారీ స్థాయిలో విడుదల అయినట్లు మోడెర్నా వివరించింది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో కంటే ఎక్కువ ప్రతిరక్షకాలు వీరిలో ఏర్పడ్డట్లు వెల్లడించింది. ఎవరిలోనూ తీవ్రమైన దుష్పరిణామాలు కానరాలేదని పేర్కొంది. అయితే, కొంత మందిలో వికారం, కండరాల నొప్పులు, తలనొప్పి, చలి, టీకా ఇచ్చిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!