Fire Accident IN Govt Hospital:మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. భందరా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఐసీయూలో ఉన్న 10 మంది నవజాతి శిశువులు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది నవజాతి శిశువులున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మిగతా చిన్నారుల పరిస్థితి తెలియాల్సి ఉంది.
Also Read: Loan App harassment: మరో దా’రుణం’… లోన్ యాప్‌ల వేధింపులకు బలైన రాజన్న సిరిసిల్ల యువకుడు..