స్వర్ణ ప్యాలస్ ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

స్వర్ణ ప్యాలస్ ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

Updated on: Aug 09, 2020 | 1:07 PM

Fire Accident At Vijayawada Covid Care Centre: విజయవాడ స్వర్ణ ప్యాలస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు ప్రమాదంలో గాయపడిన బాధితులను రమేష్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ప్రమాదం సంభవించినప్పుడు ఘటనా స్థలంలో 30 మంది పేషెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్‌గా స్వర్ణ ప్యాలస్‌ను వినియోగిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అటు ఈ ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.