కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !

ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే పేరాశతో కన్న తండ్రే  కొడకును సుపారీ ఇచ్చి చంపించాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 6:08 pm, Thu, 17 September 20
కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !

ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనే పేరాశతో కన్న తండ్రే  కొడకును సుపారీ ఇచ్చి చంపించాడు. అయితే చేసిన తప్పు వెంటాడుతూనే ఉంటుంది. నిజం బయటపడక మానదు. తాజాగా ఈ కేసుకు సంబంధించి చెన్నరాయపట్టణ పోలీసులు బుధవారం ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితేే పట్టుబడిన నిందితులు చెప్పిన ఆధారాలతో చనిపోయిన కుర్రాడి తండ్రే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని తెలిసి పోలీసులు షాకయ్యారు.

కొడుకుని అంతమొందించాలని కొన్ని నెలల క్రితం ప్లాన్‌ చేసిన పునీత్‌ (26) అనే యువకుడి తండ్రి హేమంత్‌..అందుకోసం ఓ కిరాయి బ్యాచ్ కు రూ.2 లక్షలు సుపారీ ఇచ్చాడు. దీంతో  ఆగస్టు 27న రాత్రి బైకుమీద వెళుతున్న పునీత్‌ ను స్వామి, నందీశ్, కాంతరాజు తుపాకితో కాల్చి చంపారు. కొడుకు హత్యతో తల్లి యశోదమ్మ బాాధ వర్ణణాతీతంగా మారింది. వెంటనే ఆమె చెన్నరాయపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త హేమంత్, కొడుకు పునీత్‌ మధ్య గత కొద్ది ఏళ్లుగా ఆస్తి పంపకాలపై విబేధాలు ఉన్నాయని, భర్తే హత్య చేయించి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొంది. దీని ఆధారంగా హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, మర్డర్ స్కెచ్ వెలుగులోకి వచ్చింది.  నిందితులను అరెస్టు చేసి రూ.1.88 లక్షల నగదు, 5 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి