విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అంతు చిక్కని వ్యాధి గిరిజనుల్ని కలవరపెడుతోంది. దీని ప్రభావంతో అనంతగిరి రొంపల్లి పరిధిలోని కరకవలసలో ఈ నెలలోనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రాణాలు విడిచారు.

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి
Follow us

|

Updated on: Sep 17, 2020 | 11:27 AM

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అంతు చిక్కని వ్యాధి గిరిజనుల్ని కలవరపెడుతోంది. దీని ప్రభావంతో అనంతగిరి రొంపల్లి పరిధిలోని కరకవలసలో ఈ నెలలోనే ముగ్గురు అడవి బిడ్డలు ప్రాణాలు విడిచారు. వారం వ్యవధిలోనే ఇద్దరు చనిపోగా.. బుధవారం గజపతినగరం ఆస్పత్రిలో మరో వ్యక్తి మృతి చెందాడు. జ్వరంతో పాటు కాళ్లవాపులు, కడుపునొప్పితో బాధపడుతూ, సకాలంలో వైద్యం అందక  గిరిజనులు చనిపోతున్నారని సీపీఎం నాయకుడు గోవిందరావు తెలిపారు.

ఈనెలలో కరకవలస గ్రామానికి చెందిన  కోనెపు సీతయ్య , జాగడ పద్మ , జాగడ ఎర్రయ్య, కోటపర్తి బుచ్చయ్యలు మృతి చెందారు.  భీమవరం హెల్త్ సెంటర్ కు వెళ్లాలంటే సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు. గజపతినగరం, మెంటాడ హాస్పిటల్స్ కూడా 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయట. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

అందాల అనసూయకు అదిరిపోయే ఆఫర్ !