వరంగల్ లో ఘరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కొడుకుల దుర్మరణం

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వరంగల్‌ నగరంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు.

వరంగల్ లో ఘరో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి, కొడుకుల దుర్మరణం

Updated on: Nov 24, 2020 | 6:12 PM

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వరంగల్‌ నగరంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ బాలసముద్రం న్యూ అంబేద్కర్‌ కాలనీకి చెందిన గజ్జల సంజీవ్‌(35) ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. కాగా, మంగళవారం ఉదయం తన కొడుకు రిఫేశ్‌(14)తో కలిసి సంజీవ్ స్కూటీపై హంటర్‌రోడ్డు దీన్‌దయాళ్‌ నగర్‌కు వెళ్తున్నారు. ఇదే క్రమంలో నక్కలగుట్టలో ఆర్టీసీ బస్సు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సంజీవ్‌ భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.